Dr. BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.
న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ గారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. అంబేడ్కర్ కొందరివాడు కాదు… అందరివాడు… రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని. అసమానతలు, దురహంకారంపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా సమసమాజ స్థాపన కోసం ఎలా జీవించాలో అంబేడ్కర్ గారు తన రచనల ద్వారా చైతన్యపరచారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి. అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం – @JanaSenaParty @PawanKalyan #Ambedkar #AmbedkarJayanti2024 pic.twitter.com/vZXwyUcvIh
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2024