Jananayagan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న టీవీకే అధిపతి విజయ్(Vijay)కు ఊహించని షాక్. ఆయన నటించిన ‘జననాయగన్’ (Jananayagan) సినిమాను విడుదలకు ముందే ఆన్లైన్లో వైరలవుతోంది. రాజకీయాలపై సెటైరికల్‌గా వస్తున్న ఈ చిత్రంలోని ఐదు నిమిషాల క్లిప్‌ను పైరసీ వీరులు నెట్టింట పెట్టేశారు. దాంతో.. ఆగ్రహించిన విజయ్ అభిమానులు లీక్ చేసిన వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీవీకే చీఫ్ విజయ్ కొత్త సినిమా జననాయగన్ వాయిదాల పర్వం నడుస్తున్న వేళ సినిమాలోని కొన్ని సీన్లు లీకవ్వడం తమిళనాట దుమారం రేపుతోంది. చిత్రం టైటిల్, విజయ్ ఎంట్రీ సీన్లతో పాటు ఐదు నిమిషాల క్లిప్ లీకైంది.
Guys report this#JanaNayaganhttps://t.co/cjqHFdI8ZW
— Leo Dass (@LeoDass26) April 9, 2026
అయితే.. సినిమా ఎడిటింగ్ సమయంలో పొరపాటను కొన్ని సీన్లు లీక్ అయ్యాయని భావిస్తున్నారు. ఎందుకంటే వీడియో ఆఖర్లో ఒక వ్యక్తి పాస్ బటన్ నొక్కడం రికార్డైంది. దాంతో, లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ కేవీఎన్పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీన్లు లీకవ్వడంతో అప్రమత్తమైన చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో జననాయగన్ సీన్లపై రిపోర్ట్ చేయాలని అభిమానులను కోరింది.
#JanaNayagan leaked scenes pic.twitter.com/2VevPcLZpU
— 🌍🦁🔥 (@urs_wkDHFM) April 9, 2026