Jana Nayagan |ఇళయ దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం జన నాయగన్. విజయ్ చివరి సినిమాగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆసక్తికరంగా మారింది. సినిమా షూటింగ్, రిలీజ్ ప్లానింగ్ సమయంలో పలు అడ్డంకులు ఎదురైనట్టు సమాచారం. దీంతో అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోంది. అయితే తాజాగా తమిళ సినీ వర్గాల్లో కొత్త రిలీజ్ డేట్ హాట్ టాపిక్‌గా మారింది. మే 8న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల ఫలితాల తర్వాతే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మే 8 తేదీని టార్గెట్ చేసినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో మరో స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాను మే 15న విడుదల చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ‘జన నాయగన్’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
విజయ్ కెరీర్లో కీలకమైన ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్‌పై నెలకొన్న సస్పెన్స్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. మే 8 తేదీ నిజంగానే ఫైనల్ అవుతుందా? లేక మేకర్స్ మరో డేట్‌ను ప్రకటిస్తారా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైన ఒక స్టార్ హీరో సినిమా ఇంత డిలే కావడం అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది.