Thalapathy Kacheri | విజయ్ ‘జననాయగన్’ ఫస్ట్ సింగిల్ ‘తలపతి కచేరీ’ విడుదల
Jana Nayagan | కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలపతి విజయ్ 'జననాయగన్' (Jana Nayagan) సినిమా నుండి మొదటి పాట (First single) విడుదలైంది.
Jana Nayagan | కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలపతి విజయ్ ‘జననాయగన్’ (Jana Nayagan) సినిమా నుండి మొదటి పాట (First single) విడుదలైంది. ‘తలపతి కచేరీ’ (Thalapathy Kacheri) అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ని శనివారం సాయంత్రం విడుదల చేయగా.. విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ పాటను తనదైన స్టైల్లో అదిరిపోయే బీట్స్‌తో స్వరపరిచారు. ఈ పాటలో విజయ్ తన గొంతు వినిపించగా, అనిరుధ్, అరివు కూడా కలిసి పాడారు. అనిరుధ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ మరియు విజయ్ గ్రేస్ కలయికతో ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట వీడియోలో తలపతి విజయ్ గత బ్లాక్‌బస్టర్ సినిమాలైన ‘ఘిల్లీ’, ‘తుపాకీ’, ‘మెర్సల్’, ‘మాస్టర్’ వంటి చిత్రాలలోని తన ప్రసిద్ధ డ్యాన్స్ స్టెప్స్, సిగ్నేచర్ మూమెంట్స్‌ని గుర్తుచేస్తూ స్టెప్పులేయడం అభిమానులను మరింతగా ఉర్రూతలూగిస్తోంది.
మాస్ చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinoth) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తుంది. మమితా బైజు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ సినిమా మాత్రమే కాక, నటనకు ఆయన చివరి చిత్రం కావచ్చనే వార్తలు రావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

