జేమ్స్‌బాండ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. అమెజాన్ ప్రైమ్‌లో 25 బాండ్ చిత్రాలు స్ట్రీమింగ్
James Bond | హాలీవుడ్ యాక్షన్ చిత్రాలలో 'జేమ్స్‌బాండ్' సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వయసుతో సంబంధంలేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇక ఈ సిరీస్‌ను బేస్ చేసుకొని ఇండియాలో పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కాయి.
James Bond | హాలీవుడ్ యాక్షన్ చిత్రాలలో ‘జేమ్స్‌బాండ్’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వయసుతో సంబంధంలేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇక ఈ సిరీస్‌ను బేస్ చేసుకొని ఇండియాలో పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కాయి. ప్రముఖ బ్రిటీష్ నవలా రచయిత ఇయన్ ఫ్లేమింగ్ ‘జేమ్స్‌బాండ్’ క్యారెక్టర్‌ను సృష్టించాడు. 1961లో ఈ నవల రైట్స్‌ను అల్బర్ట్ ఆర్.బ్రొక్కోలి, హారిసాల్ట్జ్మెన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఏడాదే ఈ సిరీస్‌లో మొదటి భాగాన్ని ‘డాక్టర్ నో’ పేరుతో విడుదల చేశారు. సీన్ కాన్నెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లోనే 59.5 మిలియన్ డాలర్లను వసూళ్ చేసింది.
ఈ ఏడాదితో ‘డాక్టర్ నో’ చిత్రం విడుదలై 60 ఏళ్ళయింది. అంటే జేమ్స్ బాండ్ పాత్ర వెండితెరకు పరిచయమై అరవై ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా అమేజాన్ ప్రైమ్ సంస్థ జేమ్స్ బాండ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 25 సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ 25 సినిమాలను అమేజాన్ ప్రైమ్ అందుబాటులోకి తెచ్చింది. ఇండియాతో పాటుగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, మెక్సికో, స్పెయిన్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉండనున్నట్లు ప్రైమ్ సంస్థ తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

