Jailer Movie | జైలర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ట్రైలర్ ఎప్పుడంటే?
Jailer Movie Trailer | సరిగ్గా ఎనిమిది రోజుల్లో ఈ పాటికి జైలర్ సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. ఏ థియేటర్లో చూసిన సూపర్ స్టార్ స్లోగానే మొగుతుంది. మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై కావాలయ్యా పాట సహా ఆడియో లాంచ్‌లో రజనీ స్పీచ్ జైలర్ మూవీపై మాములు హైప్ తీసుకురాలేదు.
Jailer Movie Trailer | సరిగ్గా ఎనిమిది రోజుల్లో ఈ పాటికి జైలర్ సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. ఏ థియేటర్లో చూసిన సూపర్ స్టార్ స్లోగానే మొగుతుంది. మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై కావాలయ్యా పాట సహా ఆడియో లాంచ్‌లో రజనీ స్పీచ్ జైలర్ మూవీపై మాములు హైప్ తీసుకురాలేదు. పదేళ్లకు పైగా సరైన హిట్టులేని రజనీకు జైలర్ మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. నెల్సన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి హైప్ తీసుకొస్తున్నారు.
తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. జైలర్ సినిమా ట్రైలర్‌ను సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దాంతో రజనీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రికార్డ్స్ అండర్ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది.
The D-Day is here 😎 Get set to witness #JailerShowcase today at 6 PM 💥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk… pic.twitter.com/9BP8azO2F4
— Sun Pictures (@sunpictures) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

