కోటి నజరానా
జైలర్' సినిమా అపూర్వ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాత కళానిధి మారన్ ప్రకటిస్తున్న బహుమతుల బొనాంజ ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘జైలర్' ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల వసూళ్లను సాధించింది.
‘జైలర్’ సినిమా అపూర్వ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాత కళానిధి మారన్ ప్రకటిస్తున్న బహుమతుల బొనాంజ ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బీఎండబ్ల్యూ ఎక్స్7 కారును బహుహతిగా అందించారు నిర్మాత కళానిధి మారన్. మూడు ప్రఖ్యాత బ్రాండ్లకు చెందిన కార్లను రజనీకాంత్ ముందుంచి,
అందులో నచ్చింది ఎంపిక చేసుకునే ఆఫర్ ఇచ్చారాయన. ఆ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు సైతం అదే రీతిలో ఫోర్షే కారును అందించారు. ఇప్పుడు బహుమతిని అందుకునే వంతు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌కు దక్కింది. తన ముందుంచిన మూడు కార్లలో అనిరుధ్ పోర్షే మకాన్ కారును బహుమతిగా స్వీకరించారు. ఈ ఎస్యూవీ విలువ కోటి పదిలక్షలు. ఈ కారుతో పాటు చెక్ రూపంలో భారీ నగదును కూడా బహుమతిగా అందుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

