NTR – Nelson | ‘జైలర్’ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ.?
NTR - Nelson | దేవరతో హిట్ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వార్ 2 సినిమాలో నటిస్తున్న తారక్ ఈ చిత్రం అనంతరం కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయబోతున్నాడు.
NTR – Nelson | దేవరతో హిట్ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వార్ 2 సినిమాలో నటిస్తున్న తారక్ ఈ చిత్రం అనంతరం కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించనుంది. దీని తర్వాత మళ్లీ దేవర పార్ట్ 2 మొదలు పెట్టబోతున్నాడు తారక్. అయితే ఈ సినిమాలు లైన్లో ఉండగానే మరో క్రేజీ దర్శకుడితో తారక్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది.
హిట్లు లేక సతమవుతున్నా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జైలర్ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలిప్కుమార్తో తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సౌత్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత నెల్సన్ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. రీసెంట్గా ఆయన నిర్మాతగా కవిన్ హీరోగా బ్లడీ బెగ్గర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనంతరం జైలర్ 2 సీక్వెల్ తెరకెక్కించేపనిలో ఉన్నాడు నెల్సన్. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం నెల్సన్ తారక్ కోసం ఒక కథను రెడీ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

