Adipurush Movie | ఆదిపురుష్ నుంచి జైశ్రీరామ్ వీడియో సాంగ్ రిలీజ్
Jai Shri Ram Video Song | రెండు వారాల క్రితం తిరుగులేని హైప్‌తో రిలీజైన ఆదిపురుష్ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది.
Jai Shri Ram Video Song | వారం రోజుల క్రితం తిరుగులేని హైప్‌తో రిలీజైన ఆదిపురుష్ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క పాజిటీవ్ రివ్యూ వస్తే ఒట్టు. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దానికి తోడు డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం పుండు మీద కారం చల్లినట్లు అయింది. కలెక్షన్లు కూడా దిబేల్మని పడిపోయాయి. తొలిమూడు రోజుల్లో ముడొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే.. ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటివరకు కనీసం వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
రిజల్ట్ సంగతి అంటుంచితే ఆదిపురుష్‌లో కాస్తో కూస్తో జనాలను ఆకట్టుకుంది మాత్రం సంగీతమే. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. అంతేకాకుండా పాటలను ఓంరౌత్ అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో జై శ్రీరామ్ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నిజానికి ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చిందే ఈ పాట. లంకా దహనం కోసం వానరులను వెంటబెట్టుకుని రాముడి సేతుపై పయనమవుతున్నప్పుడు వచ్చే ఈ పాటను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు గూస్బంప్స్ గ్యారెంటీ. విజువల్ గానూ ఈ పాట అమోగం. అజయ్-అతుల్ స్వర పరిచిన ఈ పాట ఫుల్ వీడియో తాజాగా విడుదలైంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. కృతిసనన్ సీత పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడు పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నాలుగొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో వంద కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

