Janhvi Kapoor | బంపరాఫర్.. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలపై కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నది జాన్వీకపూర్. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Janhvi Kapoor | బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలపై కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నది జాన్వీకపూర్. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.
త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో గ్రామీణ కథాంశమిది కావడంతో…ప్రస్తుతం నటీనటుల కోసం ఆ ప్రాంతంలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వీకపూర్‌ను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. పాన్ ఇండియా సినిమా కావడంతో జాన్వీకపూర్ పేరును పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

