Jackie bhagnani | మా ఆస్తులని తాకట్టు పెట్టాం.. మా బాధ ఎవరికి అర్ధం కాదు: రకుల్ భర్త
Jackie bhagnani | టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది.
Jackie bhagnani | టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో ‘బడే మియా ఛోటే మియా’ అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారు.
గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సినిమా కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని జాకీ స్పష్టం చేశారు. ఇది నాకు జీవితంలో ముఖ్యమైన గుణపాఠం నేర్పింది. ఒక ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో నిర్మిస్తే సరిపోదని, మూవీ రిలీజ్ అయ్యాక అర్ధమైంది. మా కథతో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారనే దానిపై ఒక్కసారి విశ్లేషించుకోవాలి.
ప్రేక్షకుల నిర్ణయం సరైనదే కావచ్చు, వారిని తప్పు పట్టకుండా దీనిని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి అని జాకీ అన్నారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడిన ఆయన మేము పెట్టిన పెట్టుబడిలో 50 శాతం తక్కువే వసూళ్లు వచ్చాయి. ఈ విషయాలు చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కాని, లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో చిత్రం తీసాం.కాని అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాం అని జాకీ భగ్నానీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘బడే మియా ఛోటే మియా’ తెరకెక్కగా, ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా వంటి తారలు కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

