Lokesh Kanagaraj | డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసిందే. DC టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రివేంజ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.
మేకర్స్ క్రేజీ వార్తను షేర్ చేశారు. లోకేశ్ కనగరాజ్ టీం షూటింగ్ పూర్తి చేసింది.గెట్ రెడీ అంటూ సెట్స్‌లో టీం కేక్‌కట్ చేసిన ఫొటోలను సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఇప్పుడీ ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. దేవదాస్ ప్రేమ, హింస, క్రైం లాంటి ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ మూవీలో లోకేశ్ కనగరాజ్ దేవదాస్‌గా నటిస్తున్నాడు. వామికా గబ్బి చంద్ర పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
బ్లడీ బ్రూతల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్లలో రక్తపు కత్తులు, రక్తపాతంతో కూడిన రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం 2026 సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటిదాకా స్టార్ యాక్టర్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన లోకేశ్ కనగరాజ్ ఇక తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తూ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడనేది ఆసక్తి నెలకొంది.
#DC Shoot wrapped 🌹🔫 You ready?@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial @WamiqaG @isanjkayy @mukesh_DOP #PrasannaGK #KannanS @PC_stunts @kabilanchelliah pic.twitter.com/wxorrQu8vy
— Sun Pictures (@sunpictures) April 27, 2026