Bramayugam | తగ్గేదే లే అంటోన్న మమ్ముట్టి.. అప్పుడే భ్రమయుగం షూట్‌కు ప్యాకప్
Bramayugam | 2023లో ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి హార్రర్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న చిత్రం భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Bramayugam | ఏడు పదుల వయస్సులోనూ ప్రొఫెషనల్‌గా ఫుల్బిజీగా ఉంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). ఈ పాన్ ఇండియా 2023లో ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి హార్రర్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న చిత్రం భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో షురూ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఫైనల్ షూట్ అప్డేట్ అందించారు. భ్రమ యుగం షూటింగ్ అక్టోబర్ 18న పూర్తయింది. ఆగస్టు 17న షూటింగ్ షురూ చేసిన మమ్ముట్టి టీం కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయడం విశేషం. ఒట్టపాలెం, కోచి, అథిరపల్లి టి ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టారు మేకర్స్.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని ఉన్నాడు. మమ్ముట్టి మరో మూడు మలయాళ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ మూడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మమ్ముట్టి మరోవైపు గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక (Bazooka)లో కూడా నటిస్తున్నాడు. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
బజూక చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

