ముంబై: క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి .. ఇప్పుడు దంపతులయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి ఇంట్లో ఇవాళ ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ మూడుముళ్లు వేసినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి సునీల్ శెట్టి ఇంట్లో పెండ్లి సంబరాలు జరుగుతున్నాయి. మెహిందీ, సంగీత్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ పలువురు అతిథుల నడుమ కేఎల్ రాహుల్, అతియాలు ఒక్కటయ్యారు. చాన్నాళ్ల నుంచి ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. విదేశీ టూర్లకు రాహుల్ వెళ్లినప్పుడు.. అప్పుడు అతియా కూడా అతని వెంటే ఉండేది. ఇవాళ సాయంత్రం కొత్త జంట పెళ్లి ఫోటోలను రిలీజ్చేయనున్నది.