అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ, పూదారి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘ఇట్లు’. పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..సస్పెన్స్, థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రమిది. ఆకట్టుకునే ప్రేమ కథ ఉంటుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రామరాజు, నిమ్మ గోపి, సంగీతం : శివ – ప్రణయ్.