వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయిక. మహేశ్ ఉప్పల దర్శకుడు. నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న హీరోహీరోయిన్లను ఈ పోస్టర్లో చూడొచ్చు. ఇందులో చెవిటి, మూగ యువకుడిగా అనీష్ నటిస్తున్నారని, ఆ పాత్ర నేపథ్యం కొత్తగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజా మహాదేవ్, సంగీతం: ఎస్.థమన్.