ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ విడుదల వాయిదా పడనుందని గత కొద్దిరోజులగా సోషల్‌మీడియాలో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ‘సలార్’ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ‘కొన్ని కారణాల వల్ల సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయలేకపోతున్నాం. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నాం’ అని చిత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్లో పేర్కొంది.