స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పతాక ఘట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. పంజుర్లి అనే దేవత ఆవహించిన వ్యక్తి భూతకోల వేషధారణలో చిత్ర కథానాయకుడు రిషబ్‌శెట్టిని, పోలీస్ ఆఫీసర్‌ను అప్యాయంగా దగ్గరకు తీసుకోవడం హృదయాన్ని హత్తుకుంది. ఈ సినిమా ైక్లెమాక్స్ తరహా అనుభవం ‘కాంతార’ చిత్ర బృందానికి నిజ జీవితంలోనూ ఎదురైంది. ఇటీవల ‘కాంతార’ చిత్ర బృందం దక్షిణ కన్నడ ప్రాంతంలో నిర్వహించే పంజుర్లి వేడుకకు హాజరైంది. అక్కడ పంజుర్లి దేవత ఆవహించిన వ్యక్తి హీరో రిషబ్‌శెట్టి దగ్గరకు వచ్చి హత్తుకొని దీవెనలు అందించారు. అలాగే చిత్రబృందానికి కూడా ఆశీస్సులు అందజేశారు. ఈ సంఘటన‘కాంతార’ క్లెమాక్స్‌ను గుర్తుకు తెచ్చేలా అనిపించింది. ఈ వీడియోను చిత్ర బృందం సోషల్‌మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.