VV Vinayak | ఐదేళ్లుగా మెగా ఫోన్‌కు దూరమైన వీవీ వినాయక్ ఏం చేస్తున్నాడు.. అతడి ప్లానింగ్ ఏంటి ?
VV Vinayak | ఐదేళ్లుగా మెగా ఫోన్ పట్టకుండా ఉన్న వినాయక్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య రవితేజ తో ఒక సినిమా ఫైనల్ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. మరోవైపు చిరంజీవితోనే నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
VV Vinayak | ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కంటే ముందు నెంబర్ వన్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఆది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా అంతే మాస్ అండ్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి ఫలితాలు కూడా అంతే అద్భుతంగా వచ్చాయి. ఆది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వెంటనే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సోసోగా ఆడింది. కానీ దిల్ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు వినాయక్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ దర్శకుడికి.
చిరంజీవితో తెరకెక్కించిన ఠాగూర్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. తమిళ సినిమా రమణకు రీమేక్ అయినా కూడా అక్కడ లేని చాలా సన్నివేశాలు తెలుగులో యాడ్ చేశాడు వినాయక్.
ఆ తర్వాత సాంబ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. కానీ లక్ష్మీ, బన్నీ, కృష్ణ, అదుర్స్ లాంటి సినిమాలతో తన రేంజ్ చూపించాడు ఈయన. మధ్యలో యోగి, బద్రీనాథ్ లాంటి సినిమాలు అంచనాలు తప్పినా కూడా ఎక్కడ నష్టాలు మాత్రం తీసుకురాలేదు.
కానీ ఇలాంటి సమయంలో వచ్చిన అఖిల్ వినాయక్ కెరీర్ ను చావు దెబ్బతీసింది. దాని కంటే ముందు అల్లుడు శీను ఫ్లాప్ అయినా కూడా మంచి సినిమాగా మిగిలిపోయింది. కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ కమర్షియల్ గా మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసింది అల్లుడు శీను. కానీ అఖిల్ ఫ్లాప్ ఈ మాస్ డైరెక్టర్ కెరీర్ ను బాగా డిస్టర్బ్ చేసింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయినా కూడా అది పూర్తిగా మెగా మానియాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటలిజెంట్ దారుణంగా నిరాశ పరిచింది. దాంతో ఇప్పటి వరకు మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు.
మధ్యలో హిందీకి వెళ్లి చత్రపతి రీమేక్ చేశాడు కానీ.. అది ఒక్కరోజు కంటే ఎక్కువగా ఆడలేదు. ఐదేళ్లుగా మెగా ఫోన్ పట్టకుండా ఉన్న ఈయన నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య రవితేజ తో ఒక సినిమా ఫైనల్ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. మరోవైపు చిరంజీవితోనే నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే చిరు సినిమాల ఓపెనింగ్స్ కు ఈయన వరుసగా వస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. అయితే భోళా శంకర్ తర్వాత చిరంజీవి కూడా ఫ్లాప్ డైరెక్టర్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ లెక్కలు వేసుకొని చూసుకుంటే మాత్రం చిరంజీవి కోసం చూస్తే వినాయక మరో రెండు మూడేళ్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చూడాలిక ఈయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

