Keedaa Cola | కీడాకోలాలో తరుణ్ భాస్కర్ టీం ఫన్ రైడ్ వర్కవుట్ అయినట్టేనా..?
Keedaa Cola | తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం కీడాకోలా (Keedaa Cola). నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఎలా ఉందంటే..
Keedaa Cola | తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం కీడాకోలా (Keedaa Cola). నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. డిఫరెంట్ కామిక్ స్టైల్, మ్యానరిజంతో ఎంటర్టైన్ చేసే యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఎలా ఉందంటే..?
తరుణ్ భాస్కర్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే కీడాకోలాలో కామెడీ పక్కాగా వర్కవుట్ అయిందంటున్నారు మూవీ లవర్స్. మిగితా ఎలిమెంట్స్ మాటెలా ఉన్నా కామెడీ కోసం మాత్రం కీడాకోలాను చూసేయచ్చని ట్రేడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాలు చెబుతున్నాయి. ఏఎంబీ సినిమాస్‌లో వేసిన ప్రీమియర్స్‌లో ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సింపుల్ స్టోరీ, అద్భుతమైన యాక్టింగ్, బీజీఎం, సినిమాను తెరకెక్కించిన విధానం ఇంప్రెసివ్‌గా ఉందని అంటున్నారు సినీ జనాలు, క్రిటిక్స్. వివేక్ సాగర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందంటున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్మార్ట్ కామిక్ స్టైల్‌తో అదరగొట్టేశాడని, తరుణ్‌భాస్కర్ అండ్ బ్రహ్మీ టీం ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయాలంటే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో వీక్షించాలని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇంకేంటి మరి ఈ వీకెండ్ ఫన్ కోసం కీడాకోలాను వీక్షించండి. కీడాకోలా చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏఎంబీ సినిమాస్‌లో నవ్వుల జల్లు..
#KeedaaColaOnNov3 pic.twitter.com/ReiqwaW7YY
— Friday Fanatics 🎬 (@fridayfanatics_) November 2, 2023
Enti Anna antha maata Annav 🤣🤣@TharunBhasckerD #KeedaaCola #KeedaaColaOnNov3 #Mangalavaaram #mangalavaram #appadappadatandra #TharunB pic.twitter.com/YFTbzSuzSe
— Krish (@krishhh_10) November 3, 2023
#KeedaaCola releasing today !!#TharunBhascker #Brahmanandam pic.twitter.com/Xew0N42vgR
— Aryan (@chinchat09) November 3, 2023
The vibe of #KeedaaCola. A #VivekSagar Musical. Audio rights bagged by @saregamasouth
Get ready for #KeedaaColaTrailer tomorrow #KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns pic.twitter.com/GGJbQOWgwb
— VG Sainma (@VGSainma) October 17, 2023
కీడా కోలా టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

