Double Ismart Movie | డబుల్ ఇస్మార్ట్‌లో కేజీఎఫ్-2 విలన్?
Ram Pothineni-Puri jagannadh | ఎన్నో ఏళ్లుగా హిట్టుకు దూరమైన పూరీకి ఇస్మార్ట్ శంకర్ తిరుగులేని కంబ్యాక్ అయింది. ఇక ప్రొడ్యూసర్ల పాలిట కామధేనువులా కనక వర్షం కురిపించింది. టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటెబుల్ సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ కూడా ఒకటి. పెట్టిన బడ్జెట్‌కు రెండింతలు వసూళ్ చేసి బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది.
Ram Pothineni-Puri jagannadh | నాలుగేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పటివరకు లవర్ బాయ్ పాత్రలతో మెప్పించిన రామ్.. ఒక్కసారిగా యాక్షన్ మోడ్‌లోకి దిగి తన యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందోనని చూపించాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టుకు దూరమైన పూరీకి ఈ సినిమా తిరుగులేని కంబ్యాక్ అయింది. ఇక ప్రొడ్యూసర్ల పాలిట కామధేనువులా కనక వర్షం కురిపించింది. టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటెబుల్ సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ కూడా ఒకటి. పెట్టిన బడ్జెట్‌కు రెండింతలు వసూళ్ చేసి బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కుతుంది. డబుల్ ఇస్మార్ట్ అంటూ రెండు వారాల కిందట సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లైగర్ దెబ్బతో కొన్ని నెలలు సైలెంట్ అయిపోయిన పూరి.. మళ్లీ తిరిగి తన ఫామ్‌లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్రాలు చేస్తున్నాడు. ఈ సారి డబుల్ స్పీడ్‌తో కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఆయన షూటింగ్ సెట్లో అడుగుపెట్టినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఈ సీక్వెల్ సినిమాను కూడా పూరీ స్వీయ నిర్మాణంలో చార్మీతో కలిసి రూపొందిస్తున్నాడు. సీక్వెల్లో రామ్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించనున్నట్లు టాక్. ఇక ఈ సారి మరింత మాస్‌గా, గ్రాండ్ స్కేల్లో పాన్ ఇండియా సినిమాగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

