Tillu Square Movie | సితార సంస్థ రిస్క్ చేస్తుందా.. ఏకంగా మెగాస్టార్ సినిమాతో క్లాష్
Sitara Entertainments | ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సితారా సంస్థ పేరు బాగా వినిపిస్తుంది. పెద్ద పెద్ద స్టార్లతోనే కాకుండా మీడియం, చిన్న రేంజ్ హీరోలతో సినిమాలు తీస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు.
Sitara Entertainments | ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సితారా సంస్థ పేరు బాగా వినిపిస్తుంది. పెద్ద పెద్ద స్టార్లతోనే కాకుండా మీడియం, చిన్న రేంజ్ హీరోలతో సినిమాలు తీస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో అరడజనుకు పైగా సినిమాలు రూపొందుతున్నాయి. అందులో టిల్లు స్క్వేర్ ఒకటి. గతేడాది ఫిబ్రవరిలో ఓ మోస్తరు అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై యూత్‌లో తిరగులేని క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ మట్టుకు ఉన్నా.. మెగాస్టార్‌తో పోటీ అంటే సితారా రిస్క్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

అసలు కథలోకి వస్తే.. సితార బ్యానర్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎమ్బీ 28 సినిమాను ముందుగా ఆగస్టు 11 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉండటంతో ఆ తేదీన వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసిన ఆ డేట్‌ను మాత్రం అలానే లాక్ చేసుకోవాలని చూస్తున్నాడట. అదే తేదీన టిల్లు స్క్వేర్ను దింపాలని ప్లాన్ చేస్తుందట. కాగా ఇప్పటికే ఆ డేట్‌పై చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ కర్చీఫ్ వేసుకుంది. ఇక ఇప్పుడు అదే రోజున సిద్ధూ జోన్నలగడ్డ లాంటి చిన్న రేంజ్ హీరోను దింపుతుండటంతో పలువురు నెటీజన్లు మెగాస్టార్ సినిమాతో పోటీ ఎందుకు అని భావిస్తున్నారు.

అయితే భోళా శంకర్ సినిమాపై ఇప్పటి వరకైతే ఎలాంటి అంచనాల్లేవు. పైగా ఫ్లాపులను వెంటేసుకుని తిరిగే మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై అంతగా ఆసక్తి కనబరుస్తలేరు. కానీ టిల్లు స్క్వేర్‌కు మాత్రం యూత్‌లో తెగ క్రేజ్ ఉంది. నిజానికి ఒక విధంగా ఆలోచిస్తే భోళా శంకర్ సినిమా కంటే టిల్లు స్క్వేర్ సినిమాపైనే భారీ అంచనాలున్నాయి. అయితే ఎంత లేదన్న చిరంజీవి సినిమా కాబట్టి కావల్సినన్ని థియేటర్లు పుష్కలంగా దోరుకుతాయి. పైగా వాల్తేరుతో చిరు మంచి కంబ్యాక్ కూడా ఇచ్చేశాడు. భోళాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన కోట్లు కొల్లగొట్టడం ఖాయం. పైగా చిరుకు మాస్ ఆడియోన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అండ కూడా ఉంది.

ఈ లెక్కన టిల్లుకు కాస్త ఒత్తిడి ఉంటుంది. పైగా సిద్ధూ ఇప్పుడిప్పుడే లైమ్‌లోకి వచ్చాడు. ఇలాంటి సమయంలో చిరుతో క్లాష్ అంటే ఇండస్ట్రీలో కూడా కాస్త వ్యతిరేకత ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఫైనల్‌గా సితార సంస్థ ఏమి డిసైడవుతుందో చూడాలి మరి. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

