69th National Film Awards | నాని సినిమాకు జ్యూరీ అన్యాయం చేసిందా?
Shyam Singha Roy | అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన శ్యామ్ సింగరాయ్కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్ సహా పలువురు నెటీజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏడాదినర్థం కిందట రిలీజై మంచి వసూళ్లు సాధించింది.
Shyam Singha Roy | అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన శ్యామ్ సింగరాయ్కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్ సహా పలువురు నెటీజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏడాదినర్థం కిందట రిలీజై మంచి వసూళ్లు సాధించింది. ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బెంగాళి రచయిత శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అంతే అద్భుతంగా నాని, సాయిపల్లవిలు నటించారు.
కాగా అలాంటి సినిమాకు జాతీయ అవార్డు రావాల్సిందని పలువరు నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు జ్యూరి అన్యాయం చేసిందని, మంచి సినిమాను గుర్తించలేకపోయిందని నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మేకింగ్ ఒక్కటే కాదు సినిమాలో పాటలు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి ఇలా ప్రతీ ఒక్కటి ది బెస్ట్ ఉంటుంది. అసమానతలు.. అన్యాయాన్ని ఎదుర్కొనే బెంగాళి రచయితగా నాని టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1970ల కాలం నాటి బెంగాళ్ వాతావరణాన్ని ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ముఖ్యంగా అవినాష్ సెట్ వర్క్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయిర్ తన కెపాసిటీకి మించిన అవుట్ పుట్ ఇచ్చి అందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు. ముఖ్యంగా సిరివెన్నెల, రైజ్ ఆఫ్ శ్యామ్ పాటలు తన స్థాయేంటో నిరూపించే విధంగా ఉంటాయి.
అవార్డు గెలుచుకోవాడనికి అన్ని అర్హతులున్నా శ్యామ్సింగరాయ్కు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై ట్విట్టర్లో పెద్ద చర్చే జరుగుతుంది. ఇక నాని జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

