NTR30 Movie | నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సైఫ్ అలీఖాన్ కూడా సెట్స్‌లోకి జాయిన్ అయ్యాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 20న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ సినిమా కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. వచ్చే ఏడాది మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.