NTR | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ట్రిపుల్‌ఆర్‌లో తారక్ నటనకు ఇండియాలోనే కాదూ.. గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ఎందరో హాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. రేపో మాపో షూటింగ్‌ను కూడా మొదలుపెట్టనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తారక్ మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందించడంలో తనకు తానే సాటి నిరూపించిన దర్శకుడు వెట్రిమారన్. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు తెరకెక్కిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అవార్డులు సైతం ఆయన సినిమా కోసం వేచి చూస్తుంటాయి. ఇప్పటి వరకు వెట్రిమారన్ 5నేషనల్ అవార్డులు గెలుచున్నాడు. అలాంటి దర్శకుడితో తారక్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి గతంలోనే వీరిద్ధరి కలయికలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు దాదాపు ఈ కాంబో కన్ఫార్మ్ అయినట్లు కోలివుడ్ మీడియా కోడై కూస్తుంది.
ప్రస్తుతం వెట్రిమారన్ తమిళ కమెడియన్ సూరిని హీరోగా పెట్టి ‘విడుతలై’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ సేతపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత తారక్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది.