Ishaan Khattar | మలేషియా మోడల్‌తో షాహిద్ కపూర్ తమ్ముడి ప్రేమాయణం?
Ishaan Khattar | మరాఠిలో బ్లాక్ బస్టర్ సైరాట్ సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్లో బంపర్ హిట్టు కొట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్. ఆ తర్వాత ఖాలీ-పీలీ, ఫోన్ భూత్ వంటి డిఫరెంట్ టైప్ సినిమాలు చేసిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి
Ishaan Khattar | మరాఠి బ్లాక్ బస్టర్ సైరాట్ సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్లో బంపర్ హిట్టు కొట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్. ఆ తర్వాత ఖాలీ-పీలీ, ఫోన్ భూత్ వంటి డిఫరెంట్ టైప్ సినిమాలు చేసిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో పిప్పా అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ నటుడు మలేషియా మోడల్‌తో ప్రేమలో ఉన్నాడని ఇన్సైడ్ టాక్. మలేషియా మోడల్ చాందిని బైంజ్తో ఇషాన్ ఖత్తర్ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలాడని, ఇప్పటికే తన సర్కిల్లోని ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీ మెంబర్స్‌కు తన ప్రేయసి పరిచయం చేశాడని తెలుస్తుంది.
కాగా తాజాగా ఈ జంట బైక్‌పై రైడింగ్‌కు వెళ్లిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోని బైక్‌పై చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక వీరద్దరూ సీరియస్ రిలేషన్ షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు హిందీ మీడియాల సమాచారం. ఇక చాందిని మలేషియాలోని కౌలా లామ్పూర్లో జన్మించింది. మై మదర్ స్టోరీ, ఘహిబ్ అనే మలేషియన్ టీవీ డ్రామాల్లో ఈ బ్యూటీ నటించింది. ఈ బ్యూటీ పాండమిక్ తర్వాత బాలీవుడ్లో నటించాలని ఇక్కడే మోడల్‌గా కొనసాగుతుందట. ఈ ఏడాది ప్రారంభం నుంచే చాందిని, ఇషాన్ ఖత్తర్లు డేటింగ్ చేస్తున్నారని టాక్.
ఇక ఇషాన్ ఖత్తర్ గతంలో లైగర్ బ్యూటీ అనన్య పాండేతో పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలినట్టు వార్తలు వచ్చాయి. ఖాలీ-పీలీ సినిమా టైమ్‌లో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేశారని చెప్పుకొచ్చారు. అయితే కొన్నేళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేక్ప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు అనన్య.. ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

