Hari Hara Veera Mallu Movie | హరి హర వీరమల్లు టీజర్ డేట్ ఫిక్సయిందా.. పవన్ అభిమానులకు పండగే..!
రీమేక్‌ల గోల పక్కన పెడితే ప్రస్తుతం పవన్ అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమాపై భారీ లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాపై అంత బజ్ లేదు. పైగా ఈ సినిమా దర్శకుడు క్రిష్‌కు కూడా ఇప్పటివరకు కమర్షియల్‌గా పెద్ద హిట్టు లేదు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గానీ, టైటిల్ గ్లింప్స్గాని అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు.
Hari Hara Veera Mallu Movie Teaser | రీమేక్‌ల గోల పక్కన పెడితే ప్రస్తుతం పవన్ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాపై అంత బజ్ లేదు. పైగా ఈ సినిమా దర్శకుడు క్రిష్‌కు కూడా ఇప్పటివరకు కమర్షియల్‌గా పెద్ద హిట్టు లేదు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గానీ, టైటిల్ గ్లింప్స్గాని అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఎంతలా అంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు హిందీ హక్కుల కోసం కోట్లు ఆఫర్ చేసేంతలా. అలా ఒక్క టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హరి హర వీరమల్లు టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

