Devil | డెవిల్ సినిమా దర్శకుడి వివాదం ఒక కొలిక్కి వచ్చినట్టేనా..?
Devil | కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా దర్శకుడు ఎవరు అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమా నాది అంటే నాది అంటూ ఒకవైపు అభిషేక్ నామ, మరోవైపు నవీన్ మేడారం సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉన్నారు.
Devil | కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా దర్శకుడు ఎవరు అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమా నాది అంటే నాది అంటూ ఒకవైపు అభిషేక్ నామ, మరోవైపు నవీన్ మేడారం సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపాను అంటూ నవీన్ మేడారం ఒక స్టేట్మెంట్ విడుదల చేస్తే.. తనమీద అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ అభిషేక్ నామా కూడా చెప్తున్నాడు. ఈ సినిమా కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకున్నాను అని చెప్పాడు ఆయన. ఇదిలా ఉంటే డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా డెవిల్ సినిమా విడుదలైంది. ఇది చూసిన తర్వాత దర్శకుడు ఎవరు అనే వివాదం ఒక కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు సినిమాకు అబౌవ్ యావరేజ్ టాక్ వచ్చింది.
కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు కథను నడిపించడానికి. డెవిల్ చూశాక ఇదే అనిపించింది చాలా మందికి. సుభాష్ చంద్రబోస్ అనే పేరుతోనే సినిమా అంతా నడిచింది. ఆయన ఉన్న టైమ్ పీరియడ్ తీసుకోవడంతో కథలో ఆసక్తి పెరిగింది. మర్డర్ ఇన్వెస్టిగేషన్‌లా మొదలైనా.. నేతాజీ ప్రస్తావన మొదలైన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే అక్కడక్కడ అనవసరపు సన్నివేశాలు బాగా ఇబ్బంది పెట్టాయి. మెయిన్ కథను ఇబ్బంది పెట్టేలా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఉంది. ప్రీ ఇంటర్వెల్ వరకు సాదాసీదాగా కథ సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది. సెకండాఫ్ మొదలయ్యాక కూడా స్లో స్క్రీన్ ప్లే ఇబ్బంది పెడుతుంది.
డెవిల్ ఎవరు.. ఎందుకు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు.. ఇవన్నీ రివిల్ అయ్యే సన్నివేశం బాగా పేలింది. నేతాజీ గురించి చెప్పిన ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. డెవిల్ సినిమాకు ఈ దేశభక్తి కోణమే స్పెషల్ అట్రాక్షన్. క్లైమాక్స్ జస్ట్ ఓకే.. కానీ ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ మరోసారి రెచ్చిపోయాడు.. సీక్రెట్ ఏజెంట్ పాత్రకు ప్రాణం పోశాడు. సంయుక్త మీనన్ కథకు అవసరం మేర బాగా నటించింది. నవీన్ మేడారం, అభిషేక్ నామ ఇద్దరూ ఈ సినిమా మాదే అంటున్నారు. ఇందులో హైలైట్స్ ఎన్ని ఉన్నాయో.. మిస్ ఫైర్స్ కూడా అన్నే ఉన్నాయి. దాంతో సినిమా కమర్షియల్‌గా ఆడితే క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ఎవరికి వాళ్లు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకపోరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

