Chiranjeevi | హ్యట్రిక్‌కు రెడీ అవుతున్న హిట్టు కాంబో.. వినాయక్ దర్శకత్వంలో చిరు నెక్స్ట్ మూవీ?
మాస్ సినిమాలకు పెట్టింది వి.వి వినాయక్ పేరు. ఇప్పుడంటే స్లో అయ్యాడు గానీ, అప్పట్లో ఆయన సినిమాలకుండే క్రేజ్ వేరు. ఒకనొక దశలో స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయమని వినాయక్‌ను అడిగేవారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Chiranjeevi-V.V Vinayak | మాస్ సినిమాలకు పెట్టింది వి.వి వినాయక్ పేరు. ఇప్పుడంటే స్లో అయ్యాడు గానీ, అప్పట్లో ఆయన సినిమాలకుండే క్రేజ్ వేరు. ఒకనొక దశలో స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయమని వినాయక్‌ను అడిగేవారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే గత రెండు మూడు రోజులుగా వినాయక్, చిరుతో మూడోసారి జత కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ సందడి కనిపించింది.
అయితే అవన్నీ పుకార్లేనని సమాచారం. అసలు చిరంజీవి ఇప్పుడు రీమేక్‌ల జోలికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వినాయక్ మంచి కథతో వస్తే తను రెడీగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి రెండు భారీ విజయాలు ఇచ్చిన వినాయక్‌కు మరో అవకాశం చిరు కచ్చితంగా ఇచ్చే చాన్స్ ఉంది. ఇక వినాయక్ ఖైదీ నెం.150 తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో ‘ఇంటిలిజెంట్’ తీసి డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా చేయలేదు. దాంతో తన టాలీవుడ్ రీ ఏంట్రీ చిరుతోనే అని బెట్టుతో కూర్చున్నాడట. ఈ క్రమంలో చిరుకు నచ్చే కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఇక చిరు కూడా ‘భోళా శంకర్’ తర్వాత ఏ సినిమా చేస్తాడా అనే క్లారిటీ ఇప్పటికైతే లేదు. అన్ని కుదరితే వినాయక్‌తోనే చిరు తన నెక్స్ట్ సినిమా చేసే అవకాశమున్నట్లు టాలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

