SSMB28 Movie Title | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. ‘అలవైకుంఠపురం’లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ చాలా క్చాచీగా అందరికి నచ్చేలా ఉంటాయన్నది వాస్తవం. అచ్చ తెలుగు పదాలతో కథలోని మేయిన్ పాయింట్‌నే టైటిల్‌గా ఎంచుకుంటుంటాడు. కాగా తాజాగా ఈ సినిమాకు కూడా కథలోని కోర్ పాయింట్‌ను బేస్ చేసుకుని అమ్మకథ, ఆరంభం అనే టైటిల్స్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మకథ అనే టైటిల్ త్రివిక్రమ్‌కు బాగా నచ్చిందని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ టైటిల్ గురించి ట్వి్ట్టర్లో తెగ చర్చలు నడుస్తున్నారు. ఫ్యాన్స్‌కే కాదు సగటు ప్రేక్షకుడికి కూడా ఆ టైటిల్ నచ్చలేదు అని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.
#AmmaKatha in consideration
— Milagro Movies (@MilagroMovies) March 14, 2023
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనాంక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
టైటిల్ చాలా బాగుంది… #AmmaKatha 😍 Ok చేసేయండి… #SSMB28 💥
— Hanu (@HanuNews) March 14, 2023