ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ హీరో యశ్ (Yash). ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF 2)ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి..గ్లోబల్ బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ చేయబోయే సినిమా ఏంటని ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. వారి కోసం ఓ క్రేజీ అప్డేట్ ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
మఫ్టీ ఫేం డైరెక్టర్ నార్థన్ (Narthan) తో కొత్త సినిమా చేయబోతున్నాడట. కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా 50వ రోజు సందర్భంగా 2022 జూన్ 3న అధికారికంగా ఈ క్రేజీ మూవీకి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారట మేకర్స్. ఈ చిత్రంపై మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.
యశ్‌కు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. అగ్ర నిర్మాత సాజిద్ నదియావాలా (Sajid Nadiadwala) యశ్‌తో మూడు సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు రాగా..దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు.