Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తున్న నయా ప్రాజెక్ట్ హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే మేకర్స్ హాయ్ నాన్న ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
హాయ్ నాన్న ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ T-Series భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. నా ఫ్రెండ్ యశ్నను కలవండి.. అంటూ మృణాళ్ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో షురూ అయిన టైటిల్ గ్లింప్స్.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
హాయ్ నాన్న చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్, నాని, బేబి కైరా మధ్య సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ సినిమాకు సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..