Yatra 2 | యాత్ర 2 క్రేజీ న్యూస్.. చంద్రబాబునాయుడు పాత్రలో కనిపించేదెవరో తెలుసా..?
Yatra 2 | 2019లో మహి వి రాఘవ్ దర్శకత్వంలో విడుదలైన యాత్ర (Yatra) బయోపిక్కు సీక్వెల్‌గా వస్తున్న ప్రాజెక్ట్ యాత్ర 2 (Yatra 2). ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌గా మమ్ముట్టి, వైఎస్ జగన్‌గా కోలీవుడ్ యాక్టర్ జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Yatra 2 | 2019లో మహి వి రాఘవ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం యాత్ర (Yatra). ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ బయోపిక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ప్రాజెక్ట్ యాత్ర 2 (Yatra 2). ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌గా మమ్ముట్టి, వైఎస్ జగన్‌గా కోలీవుడ్ యాక్టర్ జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లో యాత్ర 2 షూటింగ్ షురూ అయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కథానుగుణంగా యాత్ర 2లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండబోతుందట. ఈ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) అయితే సీబీఎన్ పాత్రకు సరిగ్గా సరిపోతారని ఫిక్సయ్యాడట డైరెక్టర్.
దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై మహి వి రాఘవ్ మహేశ్ మంజ్రేకర్‌ను సీబీఎన్ పాత్రలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాత్ర 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Mahesh Manjrekar
యాత్ర 2 షూటింగ్ స్టిల్..
Shooting on progress!#Yathra2@mammukka #Mammootty#Yatra2 #KannurSquad #kathalthecore #Bramayugam #Bazooka #Bilal pic.twitter.com/PvQHGdqFec
— കിമോത്തി അൽബാനി (@Junaidjunu3698) September 22, 2023
యాత్ర 2 మోషన్ పోస్టర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

