ఆ సినిమా వల్ల ఒరిగిందేంలేదు
మనసులో ఏది ఉంటే దాన్ని కుండబద్దలు చేసేయడం ఫహద్ ఫాజిల్ ైస్టెల్. అయితే.. వీటివల్ల కొందరి మనసులు బాధపడే అవకాశం లేకపోలేదు. తత్ఫలితంగా విమర్శలు కూడా ఎదురవుతాయి. కానీ ఫహద్ ఫాజిల్ అలాంటివేం పట్టించుకోరు.
మనసులో ఏది ఉంటే దాన్ని కుండబద్దలు చేసేయడం ఫహద్ ఫాజిల్ ైస్టెల్. అయితే.. వీటివల్ల కొందరి మనసులు బాధపడే అవకాశం లేకపోలేదు. తత్ఫలితంగా విమర్శలు కూడా ఎదురవుతాయి. కానీ ఫహద్ ఫాజిల్ అలాంటివేం పట్టించుకోరు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి కామెంట్లే చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుష్ప’ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘అసలు ‘పుష్ప’ వల్ల నాకు ఒరిగిందేం లేదు. ఆ సినిమా వల్ల నాకు ప్రత్యేకమైన క్రేజు ఏమైనా వచ్చిందా?! అంటే.. అదీ లేదు. అలా అని నేనెవర్నీ తప్పపట్టను. ఈ విషయం డైరెక్ట్‌గా సుకుమార్‌కే చెప్పాను.
నిజానికి ఈ సినిమా సుకుమార్‌పై ఉన్న ప్రేమ, గౌరవం వల్ల చేశాను కానీ.. ఎప్పటికీ నా తొలి ప్రయారిటీ మలయాళం సినిమానే.’ అని తెలిపారు ఫహద్ ఫాజిల్. నిజానికి ‘పుష్ప’ అతనికి మంచి పేరు తెచ్చిన మాటా వాస్తవం. తను కనిపించింది చివరి 20నిమిషాలే అయినా, రానున్న రెండో పార్ట్ కోసం ఆడియన్స్ ఎదురు చూసేలా చేసిన ఈ చిత్రంలోని పాత్రల్లో ఆయన పాత్ర కూడా ఒకటి. అంతేకాదు, మలయాళం దాటి, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఫహద్ పేరు మారుమోగేలా చేసింది ‘పుష్ప’. అలాంటి సినిమా గురించి ఇలా మాట్లాడం కొందరికి బాధ కలిగించిన మాట వాస్తవం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

