Hansika Motwani | హన్సిక ఇంట పెళ్లి సందడి షురూ.. వైరలవుతున్న ఫొటోలు..!
Hansika Motwani | ముంబయి బొద్దుగుమ్మ హన్సిక ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. ప్రియుడు, తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల హన్సిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ముంబయిలోని హన్సిక నివాసంలో మగళవారం ‘మాతా కీ చౌకీ’ (గౌరీ పూజ) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో హన్సిక-సోహైల్ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హన్సిక-సోహైల్ ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులు. ఈ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల ప్రేమ అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పారిస్ ఈఫిల్ టవర్ ముందు సోహైల్‌తో దిగిన ఫొటోలను పంచుకున్న హన్సిక.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా కోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం