Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Bloody Romeo | ప్యారడైజ్ సినిమాలో రెండు జడలతో ఊహించని లుక్‌లో కనిపించిన నాని ఇక ఈ సారి 'బ్లడీ రోమియో' (Bloody Romeo)లో మాత్రం నయా మేకోవర్‌లో సందడి చేయబోతున్నాడు. నాని ఇందులో గ్యాంగ్‌స్టర్ నుంచి చెఫ్‌గా మారిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.
Bloody Romeo | ‘ఓజీ’ తర్వాత డైరెక్టర్ సుజీత్ కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). ఇప్పటికే బ్లడీ రోమియో టీజర్‌ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు సుజీత్ . ప్యారడైజ్ సినిమాలో రెండు జడలతో ఊహించని లుక్‌లో కనిపించిన నాని ఇక ఈ సారి నయా మేకోవర్‌లో సందడి చేయబోతున్నాడు. ఈ సారి మాత్రం సూపర్ స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు బ్లడీ రోమియో టీం రిలీజ్ చేసిన తాజా వీడియో ఒకటి హింట్ ఇచ్చేస్తుంది.
స్టైలిష్ హెయిర్ అండ్ బ్లాక్ గూగుల్స్ లో మేకోవర్ అయిన నాని లుక్‌ను చూపించీ చూపించనట్టుగా సుజీత్ టీం ఫుడ్ ట్రక్‌పై.. Bloody Romeo.. The Kitchen Open Soon అని రాసిన వీడియోను షేర్ చేసింది. ఈ సారి కొత్త నానిని చూడబోతున్నారని లేటెస్ట్ విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తోన్న బ్లడీ రోమియో చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
నాని ఇందులో గ్యాంగ్‌స్టర్ నుంచి చెఫ్‌గా మారిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. బ్లడీ రోమియో షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానుందని వార్తలు వచ్చాయని తెలిసిందే. నాని అక్టోబర్ నుంచి డేట్స్ కేటాయించాడట. కథానుగుణంగా సినిమాకు సంబంధించిన ప్రధాన భాగం లండన్‌లో షూట్ చేయనున్నారట. ఈ మూవీని ముందుగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించాల్సి ఉండగా పలు కారణాల వల్ల నిహారికా ఎంటర్టైన్మెంట్స్ చేతికి వెళ్లినట్టు టాక్.
Inka Raccha Raccheee…. 💥💥💥
#BloodyRomeo @NameisNani @Sujeethsign https://t.co/dLkhLR0bMe
— Bloody Romeo (@BloodyRomeoFilm) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

