ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’.వేణు మడికంటి దర్శకుడు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డా॥ రాజేంద్రప్రసాద్ , సోనియా అగర్వాల్ , హెబ్బాపటేల్ , పృథ్వీరాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ కథతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. నాయి క ఐశ్వర్యరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినిమాలోని ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో భావన పాత్రలో ఐశ్వర్యరాజ్ నటన ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతున్నారు.