జోన్స్ నయా జోష్
ఇండియానా జోన్స్ మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నాడు. తన అభిమానులను అలరించడానికి దాదాపు పదిహేనేండ్ల తర్వాత సెల్యులాయిడ్ స్క్రీన్‌పైకి మళ్లీ వస్తున్నాడు. 1981లో మొదలైన జోన్స్ సాహస యాత్ర హాలీవుడ్లో అప్పట్లో రికార్డులు సృష్టించింది.
ఇండియానా జోన్స్ మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నాడు. తన అభిమానులను అలరించడానికి దాదాపు పదిహేనేండ్ల తర్వాత సెల్యులాయిడ్ స్క్రీన్‌పైకి మళ్లీ వస్తున్నాడు. 1981లో మొదలైన జోన్స్ సాహస యాత్ర హాలీవుడ్లో అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ ఫ్రాంచైజీలో ఐదో సినిమాగా నిర్మితమైన ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ ఈ నెల 29న ప్రేక్షకులను పలకరించనుంది. మొదటి నాలుగు సినిమాలకు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహిస్తే, తాజా చిత్రానికి జేమ్స్ మ్యాన్‌గోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
స్పీల్బర్గ్ స్థాయిలో కాకపోయినా ఆయన మెచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దామని చెబుతున్నాడు దర్శకుడు జేమ్స్.మరోవైపు ఈ సిరీస్‌లో మొదటి భాగం నుంచి హీరోగా నటిస్తున్న హారిసన్ ఫోర్డ్ తాజా చిత్రంలోనూ కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. 80 ఏండ్ల హారిసన్ ఎలాంటి సాహసాలు చేశాడో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నయా సినిమా వస్తున్న నేపథ్యంలో ఇండియానా సిరీస్‌లో రూపొందిన నాలుగు చిత్రాలు ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో గత నెల 31 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జోన్స్ అభిమానులంతా వాటిని చూసే పనిలో బిజీగా ఉన్నారు. ఎనిమిది పదుల జోన్స్ గత చిత్రాల్లోని తన పాత్రను మరిపిస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

