Indian Police Force | రోహిత్ శెట్టి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ టీజర్ విడుదల
Indian Police Force | బాలీవుడ్ పోలీస్ జానర్ చిత్రాలంటే మొదట గుర్తుకువచ్చేది బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty). 'సింగం', సింగం 3, సింబా, సూర్యవంశ్ వంటి కాప్(Cop) సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శెట్టి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న మరో పోలీస్ డ్రామా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force).
Indian Police Force | బాలీవుడ్ పోలీస్ జానర్ చిత్రాలంటే మొదట గుర్తుకువచ్చేది బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty). ‘సింగం’, సింగం 3, సింబా, సూర్యవంశ్ వంటి కాప్(Cop) సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శెట్టి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న మరో పోలీస్ డ్రామా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force). సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ రూపంలో జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
భారత రాజధాని ఢిల్లీలో విధ్వంసం కలిగించే వరుస బాంబు పేలుళ్లతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇక టీజర్ చూస్తే.. ఇది ఇస్లామిక్ ఉగ్రవాదం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కథాంశాన్ని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సిరీస్‌పై రోహిత్ శెట్టి మాట్లాడుతూ.. మన ఇండియన్ పోలీసుల త్యాగం, ధైర్యం ఇందులో చూపించబోతున్నాం. దీని కోసం అంకితభావంతో పనిచేసిన టీమ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. నా మొదటి సిరీస్ అమెజాన్‌లో ప్రసారం కావడం ఆనందంగా ఉంది అంటూ రోహిత్ తెలిపాడు.
రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇషా తల్వార్, విభూతి ఠాకూర్, కరణ్వీర్ మల్హోత్రా, నికితిన్ ధీర్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయ్యంక్ టాండన్, వైదేహి పరశురామి, రీతూ రాజ్ సింగ్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

