అప్పటివరకు టెన్షనే..!
కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘భారతీయుడు-2’ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘భారతీయుడు-2’ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు కమల్‌హాసన్. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ మూడోభాగం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారాయన. ‘భారతీయుడు-2’ చిత్రంలో నటించడానికి ఏకైక కారణం మూడో భాగం తాలూకు కథనే అని కమల్‌హాసన్ తెలిపారు.
దర్శకుడు శంకర్ మూడో పార్ట్ కథ చెప్పినప్పుడు తాను ఓ అభిమానిగా మారిపోయానని ఆయన అన్నారు. ‘ప్రేక్షకులకు రెండో భాగం కూడా బాగా నచ్చుతుందనుకుంటున్నా. నాకైతే మూడోభాగం బాగా నచ్చింది. కానీ అది రిలీజ్ కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అప్పటి వరకు టెన్షన్‌గానే వేచి చూడాలి. మూడో భాగంలో కథానాయకుడు సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుంది’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాభవానీ శంకర్, ఏస్జే సూర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

