Bharateeyudu 2 | కథానాయకుడిగా కమల్‌హాసన్‌కీ, దర్శకుడిగా శంకర్‌కీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిన సినిమా ‘భారతీయుడు’. 28ఏళ్ల క్రితమే ఇది పాన్ ఇండియా హిట్. విడుదలైన అన్ని భాషల్లో విజయఢంకా మోగించిన ఈ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే ‘ఇండియన్ 2’ కోసం అన్ని వయసులవారూ, అన్ని వార్గాల వారూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నెలాఖరున ట్రైలర్‌ను, జూన్‌లో సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఇతర భాషల్లో ‘ఇండియన్ 2’గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగు మాత్రం ‘భారతీయుడు 2’ పేరుతోనే విడుదల చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తెలిపారు.
సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ, శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఏ.శ్రీకర్‌ప్రసాద్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్. నిర్మాతలు: సుభాస్కరన్, జి.కె.ఎం.తమిళ్‌కుమరన్.