ఇండియాలో ఆ పాకిస్థానీ సినిమా రిలీజ్ వాయిదా
The Legend of Maula Jatt పాకిస్థాన్‌లో సూపర్ హిట్ కొట్టిన ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమా రిలీజ్‌ను ఇండియాలో నిలిపివేశారు. వాస్తవానికి ఆ సినిమా ఇవాళ ఇండియన్ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో ఫవద్ ఖాన్, మహిరా ఖాన్లు నటించారు. ఇండియాలో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐనాక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ముంబై: పాకిస్థాన్‌లో సూపర్ హిట్ కొట్టిన ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమా రిలీజ్‌ను ఇండియాలో నిలిపివేశారు. వాస్తవానికి ఆ సినిమా ఇవాళ ఇండియన్ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. దీంట్లో ఫవద్ ఖాన్, మహిరా ఖాన్లు నటించారు. ఇండియాలో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐనాక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
యాక్షన్ మూవీ స్టయిల్లో ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమాను రూపొందించారు. అక్టోబర్ 13న ఆ సినిమా పాక్‌లో విడుదలైంది. అయితే ఇండియాలో ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా, దాన్ని వాయిదా వేశారు. ఇంకా ఆ సినిమా రిలీజ్‌కు సంబంధించిన కొత్త డేట్‌ను విడుదల చేయలేదు.
సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్న విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లు తెలియజేసినట్లు ఐనాక్స్ తెలిపింది. రెండు రోజుల క్రితమే ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. బిలాల్ లాషరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. 1979లో రిలీజైన మౌలా జాట్ చిత్రానికి అనువాదంగా చెబుతున్నారు. ప్రస్తుతం ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ చిత్రం స్వల్ప సమయంలోనే 10 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది. ఇండియాలో రిలీజైన చివరి పాకిస్థానీ చిత్రం బోల్ (2011). ఆ ఫిల్మ్‌లో మహిర నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

