Viral video | గదర్ 2 స్క్రీనింగ్‌లో మై నిక్లా సాంగ్‌కు డ్యాన్స్‌తో కుమ్మేశాడు
2001లో విడుదలైన ఐకానిక్ ఫిల్మ్ గదర్ : ఏక్ ప్రేమ్ కధకు సీక్వెల్‌గా తెరకెక్కి ఈనెల 11న విడుదలైన గదర్ 2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
న్యూడిల్లీ : 2001లో విడుదలైన ఐకానిక్ ఫిల్మ్ గదర్ : ఏక్ ప్రేమ్ కధకు సీక్వెల్‌గా తెరకెక్కి ఈనెల 11న విడుదలైన గదర్ 2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ గదర్ 2లోనూ అదరగొట్టారు. తొలి మూవీకి 17 ఏండ్ల అనంతరం గదర్ 2 మూవీ బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయగా తారా సింగ్‌గా సన్నీ డియోల్ 1971 ఇండో-పాక్ వార్ సందర్భంగా జైలు శిక్షకు గురైన తన కుమారుడి కోసం గాలిస్తుంటాడు.
ఒరిజినల్ సినిమాలోని కొన్ని పాటలను సీక్వెల్లోనూ ఉంచారు. ఇక ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా ఓ వ్యక్తి మై నిక్లా గద్ది లేకే సాంగ్‌కు స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సోలంకి రుద్రాక్ష్ గదర్ 2 చూస్తున్న వ్యక్తిని చూసాడు. సాంగ్స్ ప్లే అవుతున్న సందర్భంలో సదరు వ్యక్తి తన సీటు నుంచి లేచి డ్యాన్స్ చేయడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది.
మై నిక్లా సాంగ్‌కు వ్యక్తి చేసిన క్రేజీ మూమెంట్స్‌తో కూడిన పెర్ఫామెన్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. శక్తి మాన్ తల్వార్ కధను సమకూర్చగా అనిల్ శర్మ నిర్ధేశకత్వం వహించారు. ఇంకా ఈ మూవీలో సిమ్రత్ కౌర్, లవ్ సిన్హా, మనీష్ వాధ్వా తదితరులు నటించారు.
Read More :
Upendra | కన్నడ హీరో ఉపేంద్రపై కేసు నమోదు.. నన్ను క్షమించడంటూ నటుడి పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dancing
- Gadar 2
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

