Imanvi | ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ ..నెటిజన్స్ ఫిదా
Imanvi | ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఇప్పుడు అరడజనుకి పైగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ చిత్రం ఒకటి. ‘ఫౌజీ (Fauji)’ లో హీరోయిన్గా ఇమాన్వి (Imanvi) నటిస్తుంది.
Imanvi | ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఇప్పుడు అరడజనుకి పైగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ చిత్రం ఒకటి. ‘ఫౌజీ (Fauji)’ లో హీరోయిన్గా ఇమాన్వి (Imanvi) నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రభాస్ సరసన నటించే అదృష్టం దక్కించుకున్న ఈ కొత్త భామ తన లేటెస్ట్ డ్యాన్స్ రీల్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇమాన్వి క్లాసికల్ మూవ్స్‌తో పాటు మోడ్రన్ టచ్ కలిపి చేసిన డ్యాన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
కేవలం కొన్ని గంటల్లోనే ఆ వీడియో లక్షల వ్యూస్ సాధించింది. కామెంట్స్ సెక్షన్లో ‘నెక్ట్స్ సీతారామం గర్ల్’ అని, ‘ప్రభాస్ జోడీకి పర్ఫెక్ట్ ఛాయిస్’ అని నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సీతా రామం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన దర్శకుడు హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్‌తో కలిసి భారీ స్కేల్లో ‘ఫౌజీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘సీతా రామం’ ద్వారా మృణాల్ ఠాకూర్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన హను, ఈసారి హీరోయిన్గా ఇమాన్విని ఎంపిక చేశారు. సినిమా మొదలు కాకముందే ఈ భామ పేరు చర్చలోకి రావడానికి కారణం ఆమె అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్. ‘ఫౌజీ’ ఆఫర్ రావడానికి ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయిన డ్యాన్స్ వీడియో కూడా కీలక పాత్ర పోషించిందని ఫిల్మ్‌నగర్ టాక్.
క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమాన్వి, ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు పలు స్టేజ్ షోలలో పాల్గొంది. తన డ్యాన్స్ రీల్స్ ద్వారా పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు ప్రభాస్ సినిమా ద్వారా టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘డార్లింగ్ ప్రభాస్ సరసన ఈ కొత్త టాలెంట్ చూడటానికి ఎదురు చూస్తున్నాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద, ‘ఫౌజీ’ రిలీజ్ కాకముందే ఇమాన్వి డ్యాన్స్ ట్యాలెంట్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్, ఇమాన్వి జోడీ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనే దానిపైనే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

