Ilayaraja | మ్యాస్ట్రో ఇళయరాజా జీవితం ఆధారంగా సినిమా.. హీరో ఎవరంటే?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం ఆధారంగా తమిళంలో రూపొందిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రంలో అగ్ర హీరో ధనుష్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బుధవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Ilayaraja | ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం ఆధారంగా తమిళంలో రూపొందిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రంలో అగ్ర హీరో ధనుష్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బుధవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధనుష్, కమల్‌హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధనుష్.. ఇళయరాజా పాటలను స్ఫూర్తిగా తీసుకొని తాను నటనలో రాణిస్తున్నానని తెలిపారు. ‘ఇళయరాజా బయోపిక్‌లో నటించాలన్నది నా చిరకాల స్వప్నం.
ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇళయరాజాకు నేను అభిమానిని కాదు. ఓ భక్తున్ని. ఆయన సంగీతం నటుడిగా నన్ను తీర్చిదిద్దింది. కెమెరా ముందుకు వెళ్లే ప్రతిసారి ఆయన సంగీతం వింటాను. నేను నటుడిగా ఎదగడం వెనక ఇళయరాజా సంగీతం ఇచ్చిన ప్రేరణ ఉంది’ అని ధనుష్ చెప్పారు. సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టే ముందు ఇళయరాజా జీవిత ప్రయాణానికి ఈ చిత్రం అద్దం పడుతుందని దర్శకుడు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

