అపరిచితుల ప్రయాణం

శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక చావ్లా, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకుడు. మహేష్ నిర్మాత. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్ వినూత్నంగా ఉంటుంది. తెలుగులో ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత ఉంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నలుగురు అపరిచితులైన బైక్ రైడర్స్ కథ ఇది. తమ కలల సాకారం కోసం వారు సాగించిన ప్రయాణం ఏ మలుపులు తిరిగింది? ఆ రైడర్స్ మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందన్నది మనసుల్ని హత్తుకుంటుంది. రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుంది. త్వరలో థియేటర్ల ద్వారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. పృథ్వీ, శ్రీకాంత్అయ్యంగార్, సప్తగిరి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

