Chiranjeevi | శృతిహాసన్‌తో మళ్లీ నటించాలని ఉంది.. వాల్తేరు వీరయ్య విశేషాలు చిరంజీవి మాటల్లోనే..
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య విశేషాలు చిరంజీవి మాటల్లోనే..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ (shruti haasan) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య విశేషాలు చిరంజీవి మాటల్లోనే..
మైత్రీ మూవీ మేకర్స్ తో పనిచేయడం ఎలా ఉంది..?
ఫిల్మ్ మేకింగ్ పట్ల నిర్మాతలు నవీన్ యేర్నేని చాలా మక్కువ ఉన్న వ్యక్తులు. నేను పనిచేసిన నిర్మాతల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ . బడ్జెట్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లకు నేనెప్పుడూ చెప్తుంటా. ముఖ్యమైన విషయమేంటంటే మేమంతా కేవలం 10 నిమిషాల ఎక్స్ ట్రా పుటేజీ మాత్రమే తీశాం. నిర్మాణ ఖర్చులపై చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
రవితేజతో మళ్లీ పనిచేయడం ఎలా ఉంది..?
రవితేజ చాలా ఉత్సాహంగా.. ఎనర్జిటిక్‌గా, నిబద్దతతో పనిచేస్తాడు. ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకంతో రవితేజను ఫైనల్ చేశాం. వాల్తేరు వీరయ్యలో మరోసారి రవితేజతో కలిసి పని చేయడం మంచి అనుభవం.
శృతిహాసన్ గురించి ఏం చెప్తారు..?
ఆమె నా స్నేహితుడు కమల్ హాసన్ కూతురు. సినిమాలో చాలా మంచి పాత్రలో నటించారు. మంచు కురిసే ప్రదేశాల్లో చలిలో అసౌకర్యంగా ఉన్నా.. శృతిహాసన్ చాలా బాగా డ్యాన్స్ చేశారు. అంతేకాదు శృతిహాసన్ ఇందులో ఓ ఫైట్ కూడా చేసింది. శృతిహాసన్‌తో మళ్లీ పనిచేయడానికి రెడీ.
మీ గత సినిమాలనేమైనా సీక్వెల్ చేసే ప్లాన్ ఉందా..?
ఎవరైనా ఆసక్తికరమైన కథాంశంతో నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా చేసేందుకు రెడీగా ఉన్నా. గాడ్ ఫాదర్‌కు ప్రీక్వెల్ కూడా చేయాలని అనుకున్నాం. మరి ఎవరైనా చేస్తారేమో చూడాలి.
ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో ఇతర సినిమాలు రీమేక్ చేయడంపై మీ అభిప్రాయం.?
ప్రేక్షకులు, అభిమానులు ఎప్పడూ తమ ఫేవరేట్ యాక్టర్లను హిట్ సినిమాల్లో చూడాలని కోరుకుంటుంటారు. అందుకు అనుగుణంగా మన నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ తీయడం జరుగుతుంది. అందుకే గాడ్ ఫాదర్ తెలుగులో సూపర్ హిట్టయింది.
డైరెక్టర్ బాబీ గురించి..
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యువ దర్శకుల్లో ఒకరు బాబీ. అంతేకాదు అతను నా వీరాభిమాని. బాబీ సినిమా తీసే విధానం నాకు బాగా నచ్చుతుంది. క్లిష్టపరిస్థితుల్లో కూడా కమిట్మెంట్తో పనిచేసిన బాబీని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే.
దేవీ శ్రీ ప్రసాద్ గురించి..
రవితేజలాగే చాలా ఎనర్జిటిక్ పర్సన్. సినిమాకు ఉత్తమ బాణీలు అందించడం కోసం చాలా కష్టపడ్డాడు. డీఎస్పీ కంపోజ్ చేసిన పాటలను జనాలు ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు.
మీ కొత్త సినిమాలపై..
ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో భోళా శంకర్ చేస్తున్నా. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే తెలియజేస్తా.
నీకేమో అందమెక్కువ లిరికల్ సాంగ్..
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

