Shah Rukh Khan | యాక్టింగ్ నుంచి ఎప్పటికీ రిటైరవ్వను : షారుఖ్ ఖాన్
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 2018లో జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ పఠాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్.
స్టైలిష్ యాక్టింగ్‌తో వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ సెలబ్రిటీ 2018లో జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ పఠాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్.
ఇక తన క్రేజ్ తగ్గిపోయిందనుకునేవాళ్లకు పఠాన్ సినిమాతో క్లారిటీ ఇచ్చేశాడు షారుఖ్ ఖాన్. ఈ స్టార్ యాక్టర్ సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు. ఓ నెటిజన్ షారుఖ్ ఖాన్‌ను రిటైర్మెంట్ ప్లాన్ గురించి అడిగాడు. దీనికి షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. నేను యాక్టింగ్ నుంచి ఎప్పటికీ రిటైర్ అవ్వను. యాక్టింగ్ నుంచి నన్నెవరైనా తీసేస్తే తప్ప.. ఒకవేళ అప్పుడు కూడా నేను చాలా కసిగా తిరిగొస్తా.. ఇది నిజం అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ రిప్లైతో షారుఖ్ ఖాన్ ఇక భవిష్యత్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయమని అర్థమవుతుంది. పఠాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. పఠాన్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జాన్ అబ్రహాం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో పఠాన్ ను తెరకెక్కించింది.
I will never retire from acting…I will have to be fired…and maybe even then I will come back hotter!! https://t.co/YHSQZ3ndub
— Shah Rukh Khan (@iamsrk) February 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

