Allari Naresh | ఉగ్రం ప్రమోషన్స్.. ఈవీవీ బ్యానర్లో కామెడీ సినిమా చేస్తా.. అల్లరి నరేశ్ ఇంటర్వ్యూ
Allari Naresh | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Allari Naresh | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanaka medala) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఉగ్రం గురించి అల్లరి నరేశ్ మాటల్లోనే..
కామెడీ రోల్ చేయడం ఈజీ.. ఉగ్రంలో పోలీసాఫీసర్ పాత్ర ఎంత ఛాలెంజింగ్‌గా అనిపించింది?
నిజం చెప్పాలంటే.. కామెడీ పాత్రలు చేయడం చాలా కష్టం. కామెడీ బాగా చేసే వాళ్లు ఏ పాత్రనైనా చేసేస్తారు. ఇటీవలే రంగమార్తాండలో బ్రహ్మానందంగారు చేసిన పాత్ర చాలా డిఫరెంట్. అంతేకాదు సూరి కూడా వెట్రిమారన్ కెక్కించిన విడుతలై పార్టు-1లో సీరియస్ రోల్ చేసి.. మార్పుకు స్వాగతం పలికాడు.
డిఫరెంట్ స్క్రిప్టులు ఎంపిక చేయడానికి కారణం..?
రెండు కారణాలున్నాయి.. కామెడీ కంటెంట్‌ని క్రియేట్ చేసే వారి సంఖ్య తగ్గింది. కొందరు కామెడీ కథలతో వస్తున్నారు. కానీ అవి సినిమా చేసేంతగా సరిపోవు. ఓటీటీ పెరిగిన తర్వాత నిర్మాతలు డార్క్ జోనర్ కంటెంట్‌ను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నాంది, ఉగ్రం సమయంలో డైరెక్టర్లో గుర్తించిన తేడాలేంటి..?
విజయ్ చాలా కూల్‌గా ఉంటాడు. టెన్షన్ పడడు. తనపై తనకు చాలా నమ్మకం ఉంటుంది. తన క్రాఫ్ట్ గురించి విజయ్‌కు బాగా తెలుసు. ప్రతీ ఒక్కరి పనిని గౌరవించి.. అందరికీ క్రెడిట్ ఇవ్వడం విజయ్‌లో నచ్చే బెస్ట్ థింగ్.
ఇటీవల థ్రిల్లర్ సినిమాల్లో లవ్ పోర్షన్లు అడ్డంకిగా మారాయనే విమర్శలు వస్తున్నాయి.. మరి ఉగ్రంలో ఎలా ఉండబోతున్నాయి?
సినిమా అదృశ్యమైన జనాల చుట్టూ తిరుగుతుంది. మేం ట్రైలర్ ద్వారా అడ్వాన్స్‌గా స్టోరీ చెప్పాం. ఎవరైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసాఫీసర్‌గా సమస్య వస్తే..? ఆ సమస్యను వృత్తిపరంగా ఎదుర్కొంటాడా..? వ్యక్తిగతంగా ఎదుర్కొంటాడా..? అనే దాని చుట్టూ కథ ఉంటుంది. ప్రేక్షకులను క్యారెక్టర్లు కట్టిపడేస్తాయి.
సినిమా బడ్జెట్ బాగా పెరిగిందన్న టాక్ గురించి ఏమంటారు..?
ఉగ్రంలో ఆరు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. యాక్షన్ పార్టు పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టింది.. కొంత ఆలస్యం కూడా అయింది. అయితే నిర్లక్ష్యం వల్ల మాత్రం కాలేదు. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నిర్మాతలు అవుట్‌పుట్ చూసి.. చాలా సంతోషించారు.
ఈవీవీ బ్యానర్లో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా..?
ఒకవేళ నేను ఈవీవీ బ్యానర్లో సినిమా చేయాలనుకుంటే.. అది ఖచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉండాలి. ఈవీవీ సినిమా అంటే.. బెండు అప్పారావు, కితకితలు, అత్తిలి సత్తిబాబు, తొట్టిగ్యాంగ్ లాంటి కామెడీ సినిమాలు. నేనలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నా. చాలా కథలు విన్నా. కానీ ఆ కథలతో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు.
మీ కొత్త సినిమాల గురించి..
ఇప్పటికే ఫరియా అబ్దుల్లాతో కలిసి చేస్తున్న నా నెక్ట్స్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. టైటిల్ పెట్టాల్సి ఉంది. కొత్త డైరెక్టర్ మల్లి అంకం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేం సుబ్బుతో కూడా చర్చలు జరుపుతున్నా. జెండా అనే టైటిల్‌తో రాసిన కథను కొన్నా. ఈ కథను నేను నిర్మించాలనుకుంటున్నా. గుంటూరు బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ఫిల్మ్ సెట్లో ఉండబోతుంది. డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

