Nag Ashwin | ఆ హాలీవుడ్ సినిమా చూసి వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్లాను : కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్
Nag Ashwin | టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాగ్, తొలి చిత్రం ఎవడే సుబ్రమణ్యంతో ఘన విజయాన్ని అందుకున్నారు.
Nag Ashwin – Inception Story | టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాగ్, తొలి చిత్రం ఎవడే సుబ్రమణ్యంతో ఘన విజయాన్ని అందుకున్నారు. నాని హీరోగా, విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయం అనంతరం, నాగ్ అశ్విన్ కీర్తి సురేష్‌తో మహానటి చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ సాధించారు. ఈ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత, ప్రభాస్‌తో కల్కి 2898 AD సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం కల్కి 2 సీక్వెల్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో.. తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు నాగి. అయితే రీసెంట్గా ఒక కాలేజి స్టూడెంట్స్‌తో చిట్ చాట్ నిర్వహించాడు నాగ్ అశ్విన్.
ఈ చిట్ చాట్‌లో నాగ్ అశ్విన్ తన జీవితంలో ఒకసారి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించారు. 2008లో తాను జ్ఞాపకాల అంశంతో ఒక కథ రాసుకున్నానని, రెండేళ్ల తర్వాత అదే కాన్సెప్ట్‌తో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఇన్సెప్షన్’ సినిమా ట్రైలర్ చూసి తాను నిరాశలోకి జారిపోయానని తెలిపారు. “‘ఇన్సెప్షన్’ ట్రైలర్ చూసిన తర్వాత వారం రోజుల పాటు డిప్రెషన్లో ఉన్నాను. నా కథ జ్ఞాపకాల ఆధారంగా ఉంటే, ‘ఇన్సెప్షన్’ కలల అంశంతో రూపొందింది. ఈ రెండు కాన్సెప్ట్‌లు దాదాపు సమానంగా ఉండటం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను” అని నాగ్ అశ్విన్ వివరించారు. అదే కార్యక్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. ఒక సినిమా విజయవంతం కావడానికి ఎడిటింగ్ కీలకమని, తాను గతంలో పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశానని చెప్పారు. “‘ఖలేజా’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలను నేను ఎడిట్ చేసి ఉంటే బహుశా మరింత బాగుండేవేమో” అని ఆయన అభిప్రాయపడ్డారు. కామెడీ సినిమాలను ఇష్టపడే నాగ్ అశ్విన్‌కు దర్శకుడు జంధ్యాల చిత్రాలు ప్రత్యేకంగా నచ్చుతాయని తెలిపారు. నాగ్ అశ్విన్ ఈ చర్చలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలను ఓపెన్‌గా పంచుకోవడం విద్యార్థులను ఆకట్టుకుంది. ‘కల్కి 2898 AD’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ దర్శకుడు, సీక్వెల్‌తో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

